సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈ రోజు పౌర్ణమి మంగళవారం గం.3: 20ని.ల నుండీ సాయంత్రం గం.6:47ని.ల వరకు కేతుగ్రస్త గ్రస్తోదయ చంద్ర గ్రహణం సంభవించి నందున భీమవరం పట్టణం లో దేవాలయాలు అన్ని మూసివేశారు. పంచారామ క్షేత్రంలో పాటు శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానంను సంప్రదాయం ప్రకారం పౌర్ణమి నాడు నిర్వహించే చండీహోమం ను ఉదయం 8 గంటలకు బదులుగా, కాస్త ముందుగా అనగా ఉదయం 6 గంటలకే మొదలుపెట్టి నిర్వహించిన అనంతరం, శ్రీ అమ్మవారికి నిత్య కైంకర్య భోగాదులు నిర్వహించిన అనంతరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి మూలవిరాట్ దర్శనం ను నిలుపుదల చేసామని, ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లిఖార్జున శర్మ తెలిపారు. తదుపరి 4 వ తేది రేపటి, బుధవారం శ్రీ అమ్మవారి ఆలయం ఉదయాన్నే తెరిచి శుద్ధి, సంప్రోక్షణ కార్యక్రమాలు ముగించి శ్రీ అమ్మవారి మూల విరాట్ దర్శనం ఉదయం 8 గంటలకు పునః ప్రారంభించనగునని దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్దమహాలక్ష్మి నగేష్ మరియు దేవస్థానం చైర్మన్ బొండాడ నాగభూషణం మరియు ధర్మకర్తలుతెలియచేసారు..
