సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో గత కొన్ని సంవత్సరాలుగా రెండు వర్గాల రౌడీషీటర్ల మధ్య జరుగుతున్న అధిపత్య పోరాటంలో భాగంగా ఫిబ్రవరి 27వ తేదీ న డిఎన్ఆర్ కాలేజ్ రోడ్ లోని న్యాయస్థానంల భవన సముదాయం ఎదురుగా బేవర గోవింద రావు గ్రూపు కాపు కాచి, రౌడీ షీటర్ రౌతుల రఘు గ్రూపు కోర్టులో వాయిదాకి వెళ్లి బయటకు వస్తున్న నేపధ్యంలో రౌతు రఘు పై గ్రూపు పై దాడి చేసిన రౌడీ షీటర్ బేవర గోవిందరావు నేరస్తుల గ్రూపును రెండవ పట్టణ పోలీసులు రెండవ తేదీ రాత్రి అరెస్టు చేసినట్లు భీమవరం డిఎస్పి రఘువీర్ విష్ణు తెలియజేశారు. నేడు, మంగళవారం రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ..రౌడీ షీటర్ల గ్రూపులు, వారి ఆర్థిక లావాదేవీల కారణంగా 2002 నుండి ఆదిపత్య పోరు కొనసాగుతుందని ఈ నేపథ్యంలోని 2022లో రౌతుల ఏసు హత్య జరిగిందని అనంతరం దానికి ప్రతీకారంగా 2023 సెప్టెంబర్ లో ఏసు తమ్ముడు రౌతుల రఘు అతని అనుచరులు కలిసి బేవర విజయబాబు దేవర గోవిందరావులు రోడ్డుపై మోటార్ సైకిల్ లపై వెళ్తుండగా వారిని కారుతో ఢీ కొట్టి విజయబాబును హత్య చేశారని ఆ సంఘటనలో గోవిందరావు తప్పించుకున్నాడని తెలిపారు,ఈపరిణామాలలో తప్పించుకున్న బేవర గోవిందరావు వడ్డి వెంకట దుర్గారావు సహా ఆరుగురు కలిపి, ఈసారి రఘును చంపేందుకు కుట్ర పన్ని బలే దేవదాసు సహకారంతో కత్తులు, స్టీల్ రాడ్లు తీసుకుని కైకరం నుండి భీమవరం కారులో వచ్చి కోర్టు వద్ద కాపు కాసి రఘు వచ్చిన కారును.. వారు వచ్చిన కారుతో ఢీ కొట్టి కత్తులతో చంపడానికి ప్రయత్నించారన్నారు. ఆ పరిస్థితుల్లో పోలీసులు ఫిర్యాదుదారుడు రౌతుల రఘుబాబుని రక్షించారని తెలిపారు. దాడికి పాల్బడిన వారిని పోలీసులు గాలించి గొల్లవానితిప్ప రోడ్ లోని సంజన డెవలపర్స్ లో ఉన్న షెడ్ వద్ద సర్కిల్ ఇన్స్పెక్టర్ కాళీ చరణ్ 8 మందిని పట్టుకుని వారి వద్ద నుండి ఐదు కత్తులు, ఒక కారు, రెండు స్టీల్ రాడ్లు రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారన్నారు.. అరెస్టు అయిన నలుగురిపై మూడు నుండి 16 కేసుల వరకు రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లో ఉన్నాయన్నారు. ఇన్స్పెక్టర్, జి కాళీ చరణ్, సబ్ ఇన్స్పెక్టర్ లు ఎఫ్ రహమాన్, కే రామారావు, హెచ్ మల్లికార్జున్లు పోలీస్ సిబ్బందిని డిఎస్పి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లు అభినందించి రివార్డులు అందజేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *