సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇరాన్ యుద్ధం గల్ఫ్ దేశాల సంక్షోభం నేపథ్యంలో అమెరికా, ఇజ్రాయెల్ దాడుల ప్రభావంతో ఇటీవల భారీగా పెరిగిన వెండి ధరలు మళ్లీ రోజు రోజుకు కిందకు దిగి వస్తున్నాయి. నేడు, బుధవారం వెండి కేజీకి రూ.10 వేల మేర తగ్గింది. మరోవైపు బంగారం (Gold)ధర కూడా భారీగా తగ్గింది. నేడు,(మార్చి 4న) ఉదయం విజయవాడ, హైదారాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,64,510కు చేరుకుంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే దాదాపు రూ.3110 మేర తగ్గుదల నమోదు చేసింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,800 దగ్గర ఉంది (gold rates). నిన్నటి ధరతో పోల్చుకుంటే రూ.2850 మేర తగ్గింది.మరోవైపు వెండి కూడా భారీ తగ్గుదల నమోదు చేసింది. దీంతో తిరిగి కిలో వెండి మూడు లక్షల మార్క్ దిగువకు వచ్చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2.85 లక్షలుగా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2.95 లక్షలుగా ఉంది.
