సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చిత్తూరు జిల్లాలోని పలమనేరులో నేడు, బుధవారం ఘోర రోడ్డు ప్రమాదంలో ( Road Accident) ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు బలంగా ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాద తీవ్రతకు కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు పురుషులు, ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. మృతులు కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలోని రాజాజీ నగర్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. వారు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చిత్తూరు జిల్లా పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *