సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ ఫిల్మ్ అవార్డులను(Gaddar Film Awards 2025) నేడు, శనివారం ప్రకటించింది. ఈ అవార్డుల్లో అత్యున్నతమైన ఎన్టీఆర్ జాతీయ పురస్కారం(NTR National Award) మెగాస్టార్ చిరంజీవికి( Chirangeevi) ప్రకటించారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( Pawan Kalyan) ఆనందం వ్యక్తం చేశారు. చిరంజీవికి అభినందనలు తెలియజేశారు చిరంజీవికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని ప్రకటించడం సంతోషాన్ని కలిగించింది. తెలుగు సినీ పరిశ్రమలో అన్నయ్య చిరంజీవి ప్రస్థానం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం’ అని పేర్కొన్నారు. అలాగే, పైడి జైరాజ్ అవార్డుకు కమల్ హాసన్, కాంతారావు అవార్డుకు ఆర్. నారాయణమూర్తి, బి.ఎన్. రెడ్డి అవార్డుకు సింగీతం శ్రీనివాస రావు, నాగిరెడ్డి-చక్రపాణి అవార్డుకు అశ్వినీ దత్, రఘుపతి వెంకయ్య అవార్డుకు రమేష్ ప్రసాద్. తెలుగు చిత్ర పరిశ్రమకు వారు అందించిన సేవలు విలువైనవన్నారు. గద్దర్ పురస్కారాలకు ఎంపికైనవారికీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలియజేశారు.
