సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు 2026 ఈనెల మార్చి16 నుంచి ప్రారంభం అవుతున్నాయి. పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,40,916 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణకు మొత్తం 3,415 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే ఈసారి పదో తరగతి పరీక్షల నిర్వహణలో విద్యాశాఖ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్లకు వెళ్లేందుకు వీలుగా హాల్‌టికెట్లపై క్యూఆర్ కోడ్ ముద్రించారు. మొబైల్‌తో స్కాన్ చేస్తే పరీక్ష కేంద్రం ఎక్కడుందో సులువగా తెలుసుకోవచ్చు. అలాగే హాల్‌ టికెట్‌ చూపించడం ద్వారా ఆర్టీసీ బస్సులో ఉచితంగా పరీక్ష కేంద్రాలకు చేరుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. అంతేకాకుండా పదో తరగతి హాల్‌టికెట్‌పై పరీక్షలకు ఒక సబ్జెక్ట్ మరో సబ్జెక్ట్‌ మధ్య సెలవులు వచ్చేలా టైం టేబుల్ రూపొందించారు. అలాగే ఏపీ ప్రభుత్వం ఈసారి పరీక్షకు హాజరు అయ్యే విద్యార్ధులకు నిమిషం నిబంధన నుంచి సడలింపు ఇచ్చింది. ఈసారి మాత్రం ఏకంగా అరగంట గ్రేస్‌ పిరియడ్‌ ఇచ్చింది. అయితే ప్రతి రోజూ పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.45 గంటల వరకు కొనసాగుతుంది. ఎగ్జామ్ సెంటర్‌లలోకి విద్యార్థులను మాత్రం ఉదయం 8.30 గంటల నుంచే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *