సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర ప్రభుత్వం పెంచిన వంటగ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించాలని, వంటగ్యాస్, కమర్షియల్ గ్యాస్ సరఫరాను మరింత పెంచాలని, పెరుగుతున్న నిత్యావసర, పెట్రోల్ డీజిల్, ఎరువులు ధరలను నియంత్రించాలని, ఎస్మా చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు. పెంచిన గ్యాస్, పెట్రో, డీజిల్ ధరలను తగ్గించాలని, నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ప్రకాశంచౌక్ వద్ద నేడు, శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కోనాల మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజల నడ్డి విరిచే విధంగా డొమెస్టిక్ సిలిండర్ పై రు.60, వాణిజ్య సిలిండర్ పై రు.115 పెంచడం దారుణమని విమర్శించారు. ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ దాడులు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు పై ఆంక్షలు వంటి అంతర్జాతీయ పరిస్థితులు ఎదుర్కొనే విషయంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆ భారాన్ని ఇప్పుడు ప్రజలపై మోపడం అన్యాయమని దుయ్యబట్టారు.ఇరాన్ పై సామ్రాజ్య వాదులు చేపట్టిన యుద్దాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని, అన్నారు. యుద్దాన్ని బూచిగా చూపి ‘రొయ్యల ధరలను దళారీలు తగ్గించేసి రైతులను దగా’ చేస్తున్నారని ప్రభుత్వం వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెల్లబోయిన రంగారావు, ఎం.సీతారాంప్రసాద్, సికిలే పుష్పకుమారి, మల్లుల శ్రీనివాసరావు,,కిలారి మల్లేశ్వరరావు, ప్రజానాట్యమండలి ఎఐఎస్ఎఫ్ నేతలు పాల్గొన్నారు
