సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేడు, శనివారం . పాడేరు నియోజకవర్గం నందిగరువు గ్రామంలో గిరిజనుల మధ్య వేడుకలు నిర్వహించనున్నారు ఈనేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan) హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నం విమానాశ్రయానికి నేటి ఉదయం చేరుకున్నారు. ఆయనకు ఎయిర్‌పోర్టులో స్థానిక జనసేన నేతలతో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, ఎమ్మెల్యేలు పంచకర్ల రమేశ్ బాబు, వంశీకృష్ణ శ్రీనివాస్, సుందరపు విజయ్ కుమార్,లు పవన్‌ను కలిసి స్వాగతం పలికారు. తదుపరి పవన్ హెలికాఫ్టర్‌లో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరుకు చేరుకొన్నారు. పాడేరులో జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించి, ప్రధానమంత్రి జన్ మన్ పథకం కింద ‘అడవితల్లి బాట’ పేరిట నిర్మించిన రహదారులను డిప్యూటీ సీఎం పరిశీలించనున్నారు.
