సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రుల ఆరాధ్య దైవం పొట్టి శ్రీరాములు – భీమవరం నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రుల అమరజీవి స్వర్గీయ పొట్టి శ్రీరాములు 125 జయంతిని పురస్కరించుకొని స్థానిక ఆదివారం బజారు సెంటర్ లో స్వర్గీయ పొట్టి శ్రీరాములు విగ్రహానికి టిడిపి నాయకులు పూలమాలలతో నివాళులర్పించారు. ఈసందర్భంగా నియోజకవర్గ ఇన్చార్జ్ తోట సీతారామలక్ష్మీ మాట్లాడుతూ.. భాషా ప్రయోక్త రాష్ట్రాల కోసం ముఖ్యంగా తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం తన ప్రాణాలను అర్పించి తెలుగు ప్రజల హృదయాలలో అమరిజీవిగా గుర్తింపు పొందిన స్వర్గీయ పొట్టి శ్రీరాములు ఆంధ్రుల ఆరాధ్య దైవం మన్నారు. టిడిపి రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి .జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు మాట్లాడుతూ.. అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం ఈనాటికి తెలుగు వారికి స్ఫూర్తిగా నిలుస్తుందని వారి త్యాగాన్ని మరవకూడదన్నారు. అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు కౌంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి వారికి అరుదైన గౌరవాన్ని కల్పించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు మామిడిశెట్టి ప్రసాద్ ఏపీ కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు ఉప్పులూరి చంద్రశేఖర్. మాజీ కౌన్సెలర్స్ సుబ్బారావు, మెంటే గోపి తదితరులు పాల్గొన్నారు.
