సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రామాయణం లో రావణుడి తో రాయబారానికి వెళ్లిన హనుమాన్ తోకకు నిప్పు పెట్టి ‘అహంకారం‘ చూపిన నేపథ్యంలో.. హనుమాన్ తదుపరి అదే లంకను అదే నిప్పుతో తగలబెట్టిన తీరుతెలిసిందే.. ప్రస్తుత ట్రంప్ ఒంటెద్దు పోకడతో చర్చలకు వచ్చిన ఇరాన్ ఫై విరుచుకుపడ్డాడు. తద్వారా ఇరాన్ తన యుద్ధ తంత్రాన్ని రుచి చూపిస్తూ ఇజ్రాయిల్ తో పాటు అమెరికా కు మద్దతు తెలిపిన గల్ఫ్ దేశాలకు నిప్పు పెట్టిన తీరు ప్రపంచం నివ్వెరపోయి చూస్తుంది. ప్రస్తుతం ఇరాన్ గురిచూసి కొట్టే దెబ్బలకు అమెరికా ప్రతిష్ట అంతర్జాతీయంగా మసకబారుతుంది. ఇరాన్ చుస్తే తనకు బిలియన్ డాలర్స్ నష్టపరిహారం ఇస్తే కానీ యుద్ధం అపానంటుంది. ఇక చేసేది లేక ట్రంప్ యుద్ధ విరమణకు ఆఖరికి రష్యా చైనా సాయం కూడా కొరవలసి వచ్చింది. ఇరాన్ పట్టులో ఉన్న హోర్ముజ్ జలసంధిలో ప్రపంచ దేశాలకు ముడి చమురు రవాణాకు రక్షణగా యుద్ధ నౌకలను పంపించాలన్నఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ( Trump) అభ్యర్థనను జపాన్, జర్మనీ , ఆస్టేలియా తో సహా యూరప్ దేశాలు తిరస్కరించాయి. ఈ నేపథ్యంలో నేడు, మంగళవారం మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ విషయంలో తమకు ఎవరి సాయం అవసరం లేదని అన్నారు.‘మాకు ఎవరి అవసరమూ లేదు. అమెరికా శక్తిమంతమైన దేశం. మా మిలిటరీ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైనది’ అని వ్యాఖ్యానించారు. ‘చింతచచ్చిన పులుపు చావలేదని’.. సామెత ఇరాన్ యద్ద వ్యవహారం ఓ కొలిక్కి రాక ముందే ట్రంప్ క్యూబా ను అమెరికా ఆధీనంలోకి తెచ్చుకునే గౌరవం నాకే దక్కవచ్చువ్యాఖ్యానించారు.
