సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికా- ఇరాన్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో కుదేలు అయిన దేశీయ స్టాక్ మార్కెట్ నిన్న సోమవారం బాగా కోలుకున్న తరువాత దేశీయ సూచీలు నేడు మంగళవారం కూడా అదే జోష్ ను ప్రదర్శించాయి. వరుసగా రెండో రోజు కూడా సూచీలు పైకే ఎగబాకాయి. ఇరాన్ వదిలెయ్యడంతో భారతీయ ముడిచమురు గ్యాస్ షిప్ లు 2 భారతీయ తీరం చేరిపోవడంతో మరోవైపు భారత్‌లో చమురు, గ్యాస్ కొరత లేదని కేంద్రం ప్రకటించడం స్టాక్ మార్కెట్ ఊపు పెంచింది. గత సెషన్ ముగింపు (75,502)తో పోల్చుకుంటే నేడు, మంగళవారం ఉదయం 300 పాయింట్లకు పైగా లాభంతో మొదలైన సెన్సెక్స్ చివరకు 567 పాయింట్ల లాభంతో 76,070 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 172 పాయింట్ల లాభంతో 23,581 వద్ద స్థిరపడింది (stock market). నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 559 పాయింట్లు ఎగబాకింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 92.37గా ఉంది.
