సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల భారీ హెచ్చు తగ్గులతో ఉన్న బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గుతున్నాయి. బుధవారం 10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా తగ్గితే.. కిలో వెండి ధర మాత్రం వేల రూపాయిల్లో తగ్గింది. నేడు, . బుధవారం ఉదయం 10.00 గంటలకు విజయవాడ ,హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,57,750 వద్ద ట్రేడ్ అవుతోంది. నిన్నటితో పోలిస్తే రూ.330 మేర పసిడి ధర తగ్గింది. 22 క్యారెట్ల పసిడి ధర(10 గ్రాములు) నిన్నటితో పోలిస్తే రూ.300 మేర తగ్గి రూ.1,44,600 లకు చేరింది. ఇక విజయవాడ ,హైదరాబాద్ మార్కెట్ లలో కిలో వెండి ధర సైతం రూ.5 వేల వరకు తగ్గింది. కిలో వెండి ప్రస్తుతం రూ.2.75 లక్షలుగా ఉంది. మంగళవారం ఇదే కిలో వెండి ధర రూ.2.80 లక్షలుగా ఉన్న సంగతి తెలిసిందే. ఒక్క రోజులోనే రూ. 5 వేలు తగ్గింది.
