సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దశాబ్దాలుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కు టీడీపీ పార్టీకి ఆయువు పట్టు‘తోట‘కుటుంబం నిబద్దత .. మాజీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అడ్జక్షురాలు, మాజీ రాజ్య సభ సభ్యురాలు, మాజీ మునిసిపల్ చైర్ పర్సన్, ప్రస్తుత నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి, తోట సీతారామలక్ష్మి కి అవమానం జరిగింది. నేడు, బుధవారం స్థానిక కొత్త బస్సు స్టాండ్ లో‘దివ్యంగా శక్తి ‘పధకంలో భాగంగా వికలాంగులకు ఉచిత బస్సు సౌకర్యంప్రారంభ వేడుకలో ఏర్పాటు చేసిన వేదికపైకి స్థానిక జనసేన ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు ను ముందుగా పిలచి ప్రోటోకాల్ ప్రకారం తోట సీతారామలక్ష్మి ని పిలవకుండా ఆఖరున పిలవడంతో ఆమె విస్తుపోయారు. ఇది తనను కావాలని అవమానించారని భావించి ఆమె వేదికపైకి రావడానికి నిరాకరించారు. సభికులల్లోనే కూర్చుండిపోవడంతో ఎమ్మెల్యే అంజిబాబు, ప్రోటోకాల్ లో ఇది అధికారులు చేసిన పొరపాటు అని చెప్పి. ఆమెను వేదికపైకి రావాలని స్వయంగా ఆహ్వానించారు. ఇది మీకు గుర్తుండాలి ఇప్పుడే మొదలైయ్యింది,, పర్వాలేదు అంటూ ఆయన ఆహ్వానాన్ని తిరస్కరించారు. దానితో కలెక్టర్ నాగరాణి వేదిక దిగి వచ్చి, తోట సీతారామలక్ష్మి ని వేదికపైకి తీసుకోనివెళ్లారు. అధికారులు ప్రోటోకాల్ ప్రకారం జనసేన టీడీపీ బీజేపీ వారిని వేదికపైకి పిలవాలని ఎమ్మెల్యే అంజిబాబు అధికారులకు ఆదేశించారు,
