సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: గల్ఫ్ యుద్ధం లో భాగంగా గత రాత్రి ఖతార్‌లోని భారీ గ్యాస్ క్షేత్రంపై జరిగిన దాడులు ( ఇజ్రాయిల్ పొరపాటున చేసిందా?) దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఇకపై ఆలా జరగదని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ నేడు వివరణ ఇచ్చారు. ముడి చమురు ధరలు పెరగడం,. బ్రెంట్ క్రూడాయిల్ ఒక బ్యారెల్‌కు మూడు శాతం పెరిగి 111 డాలర్లకు చేరుకుంది. గత 3 రోజులు కాస్త ఊపిరి పోసుకొంటున్న దేశీయ స్టాక్ మార్కెట్ నేడు, గురువారం మరల సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి (Indian stock market )గత సెషన్ ముగింపు (76,704)తో పోల్చుకుంటే నేడు గురువారం ఉదయం దాదాపు 2000 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ రోజంతా నష్టాల్లోనే కదలాడింది. ఒక దశలో 74 వేల దిగువకు కూడా పడిపోయింది. చివరకు సెన్సెక్స్ 2496 పాయింట్ల నష్టంతో 74,207 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 775 పాయింట్ల నష్టంతో 23,002 వద్ద స్థిరపడింది. అయితే సెన్సెక్స్‌, నిఫ్టీలో ఓఎన్‌జీసీ, ఆయిల్ ఇండియా షేర్లు మాత్రమే స్వల్ప లాభాలు ఆర్జించాయి. బ్యాంక్ నిఫ్టీ 1875 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1797 పాయింట్లు దిగజారింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 92.63గా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *