సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏ ప్రాంత ప్రజలైనా రామరాజ్యం కావాలని కోరుకుంటారని, ఉత్తమ పాలకుడు కోదండ శ్రీరాముడు అని, కోదండ రాముని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. భీమవరం మండలం యనమదుర్రు గ్రామంలోని కోదండ రామాలయంలో నేటి,శనివారం ఉదయం శ్రీసీతారామచంద్ర లక్ష్మణ, హనుమ, గణపతి, సుబ్రహ్మణ్య విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే అంజిబాబు విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొని స్వామివార్లను దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు గణపతి పూజ, పుణ్యహవాచనం, అగ్ని ప్రతిష్టాపన హోమము నిర్వహించారు. అనంతరం స్వామివారి శాంతి కళ్యాణం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్ధ ప్రసాదాలను స్వీకరించారు. గ్రామస్తులు, గ్రామ పెద్దలు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
