సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరల్లో ఒక్కసారిగా పెరుగుదల నమోదైంది. అదికూడా రంజాన్ మాసం కావడంతో చికెన్ విక్రయాలు పెరిగాయి. అంతేకాకుండా పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్నసుమారు 200 పైగా పౌల్ట్రీలలో ఎండాకాలం వాతావరణ మార్పులతో కోళ్లు మరణిస్తున్నాయి. దీని వల్ల కోళ్ల ఉత్పత్తి తగ్గిపోవడంతో ధరలు పెరుగుతున్నాయని పాల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. తాజగా పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరగటంతో రవాణా ఖర్చులు పెరగటంతో .. భీమవరంలో గత నెలలో బాయిలర్ కోడి కేజీ స్కీన్ లెస్ 270 కాగా ఈనెల మర్చి ప్రారంభం నుండి కేజీ స్కిన్‌లెస్ చికెన్ రూ.330 వరకు ఉండగా.. ఇప్పుడు తాజా గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 370 నుండి రూ.400 వరకు చేరుకున్నాయి. తెలుగు రాష్ట్రాలలో దాదాపు ఇవే ధరలు కు చికెన్ ధరలు పెరిగిపోయాయి. తాజగా పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరగటంతో రవాణా ఖర్చులు పెరగటంతో మరింత ధరలు పెరిగే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *