సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇరాన్‌కు, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం 22వ రోజుకు చేరుకుంది. ఈ యుద్ధంతో ప్రేమేయం లేకపోయిన ప్రపంచ దేశాల భవిషత్తు అధోగతి మార్గం పట్టింది. ఇరాన్ ఎదురుదాడులతో తగ్గిన అమెరికా పునరాలోచన లో పడింది. ఇరాన్ ను కట్టడి చెయ్యడానికి చైనా, రష్యా కూడా ముందుకు రాకపోవడంతో.. అమెరికా ఒంటరి కావడంతో.. ఇక చేసింది ల్లేక సైనిక చర్యను క్రమంగా తగ్గించే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ( Donald trump) తాజాగా నేడు, శనివారం కీలక ప్రకటన చేశారు. దీనిపై తాజాగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ (Abbas Araghchi) స్పందించారు. మోసపూరిత అమెరికా తో గత అనుభవాలు దృష్ట్యా కాల్పుల విరమణకు తాము అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. అయితే యుద్ధం ముగించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నా తాము వినడానికి, పరిశీలించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇదిలా ఉండగా తాజగా ఇరాన్ తనకు 4000 కిమీ దూరంలో ఉన్న .. హిందూ మహాసముద్రంలోని డియేగో గార్సియా చాగోస్ ద్వీపసముదాయంలో గల అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ ఈ మిసైల్స్‌ను ప్రయోగించిందని సమాచారం. మీడియా కథనాల ప్రకారం, ఇరాన్ ప్రయోగించిన తొలి మిసైల్ మార్గమధ్యంలోనే విఫలమైంది. ఈ దాడిలో రెండో మిసైల్ ధ్వంసమైందా? లేదా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
