సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ( NAREDNRA MODI) తాజగా .. అరుదైన రికార్డు నెలకొల్పారు గుజరాత్ ముఖ్యమంత్రిగా,. దేశ ప్రధానిగా తన పదవి కాలంలో ఎలాంటి విరామమూ లేకుండా 8,931 రోజుల పాటు సుదీర్ఘకాలం ప్రభుత్వాధిపతిగా పని చేసిన తోలి వ్యక్తిగా నిలిచారు. ఇప్పటివరకు ఈ రికార్డు సిక్కీం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ (8,930 రోజులు) పేరిట ఉంది. తాజాగా ఆయన రికార్డును ప్రధాని మోదీ అధిగమించారు. పవన్ కుమార్ 8,930 రోజుల పాటు సిక్కీం సీఎం హోదాలో ఉన్నారు. .2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ 2014లో ప్రధాని అయ్యేవరకు ఆ పదవిలో ఉన్నారు. 2014 నుంచి నేటి వరకు ప్రధానిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో 8,931 రోజుల పాటు ప్రభుత్వాధినేతగా ఉన్నారు. అంతేకాదు గుజరాత్‌కు అత్యధిక కాలం సీఎంగా ఉన్న రికార్డు కూడా మోదీ పేరిటే ఉంది. అలాగే కేంద్రంలో రెండు సార్లు పదవీ కాలాన్ని పూర్తి చేసుకుని మూడోసారి అధికారం చేపట్టిన తొలి కాంగ్రెసేతర నేతగా కూడా రికార్డు నెలకొల్పారు. జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత భారతదేశానికి అత్యధిక కాలం ప్రధానిగా ఉన్న రెండో నేతగా కూడా మోదీ రికార్డు సాధించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *