సిగ్మా తెలుగు డాట్ ఇన్ న్యూస్: ఏపీలో కొత్త పెన్షన్ కోసం ఎదురుచూస్తున్నవారికి కూటమి ప్రభుత్వం శుభవార్త అందించనున్నదని మాజీ ఎంపీ, భీమవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ తోట సీతారామలక్ష్మి తెలిపారు. భీమవరం నియోజకవర్గ టిడిపి కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్లో నియోజకవర్గ ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించిన సీతారామలక్ష్మీ మాట్లాడుతూ ..జూన్ 1 నుంచి నూతన పెన్షన్ల మంజూరుకి కుటమి ప్రభుత్వం సిద్ధమవుతుందని మొదటగా వితంతువులకు తరువాత అంగ వికలాంగులకు, వృద్ధాప్య మరియు ఇతర పెన్షన్లకు అవకాశం కల్పించనున్నారని తెలిపారు. టిడిపి రాష్ట్ర మాజీ కోశాధికారి మెంటే పార్థసారధి మాట్లాడుతూ ప్రజా సంక్షేమం అభివృద్ధి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం లక్ష్యమన్నారు. భీమవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ ప్రతి శుక్రవారం ప్రజల నుండి వినతలు స్వీకరిస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ వచ్చిన వారికి భోజనం వసతి ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఎఏంసి మాజీ చైర్మన్ ఇందుకురి రామలింగరాజు మాట్లాడుతూ మాదృష్టికి తీసుకువచ్చిన వితంతు పెన్షన్లు, వయోవృద్ధుల పెన్షన్లు,గత వైసిపి ప్రభుత్వంలో వివిధ కారణలవల్ల నిలిపివేసిన పెన్షన్ల అర్జీలు పరిష్కారానికి ప్రభుత్వపరంగా కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భీమవరం నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *