సిగ్మా తెలుగు డాట్ ఇన్ న్యూస్: ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మహారాష్ట్రలోని నాసిక్‌లో TCS ఆఫీసులో లైంగిక వేధింపులు, హిందూ అమ్మాయిలను ముస్లీమ్ మతంలోకి బలవంతపు మతమార్పిళ్ల వ్యవహారం కేసులో 8గురు ఉద్యోగులు అరెస్ట్ అయినప్పటికీ ప్రధాన నిందితురాలు, గత 15 రోజులుగా తప్పించుకొని తిరుగుతున్నా నిదా ఖాన్‌ను పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. గత నెల 25 నుంచి ఈమె పరారీలో ఉండగా.. గత గురువారం రాత్రి ఛత్రపతి శంభాజీ నగర్లో పోలీసులకు చిక్కింది. ప్రఖ్యాత స్టాఫ్ట్ వేరు రంగంలో సైతం ఈ మతమార్పిళ్ల కేసుకు సంబంధించి పోలీసులు సిట్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 9 మందిపై కేసులు నమోదయ్యాయి. ఇప్పటిదాకా మేనేజర్ సహా 8 మందిని పోలీసులు అరెస్టు చేసి విచారించారు. ఈ దర్యాప్తులో కంపెనీలో సీనియర్ ఉద్యోగి అయిన నిదా ఖాన్.. వాట్సాప్ గ్రూప్‌లో ఉద్యోగులను టార్గెట్ చేసి వేధింపులకు పాల్పడ్డట్లు తేలింది. ఇస్లాం సిద్ధాంతాలను పాటించాలని.. ఈ మతానికి చెందిన దుస్తులు ధరించాలని, లేకపోతె ‘ఉద్యోగాలు కోల్పోతారని’ ఆమె మహిళా ఉద్యోగులను బలవంతపెట్టినట్లు విచారణలో తేలింది. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. అనంతరం నిధా ఖాన్ ముందస్తు బెయిల్ కోసం నాసిక్ కోర్టులో పిటిషన్ వేసింది. కానీ ఆమె పిటిషన్‌ను కోర్టు రిజెక్ట్ చేసింది.
