సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రామ్‌చరణ్‌, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సుకుమార్ శిష్యుడు ‘‘ఉప్పెన\‘ సినిమా దర్శకుడు బుచ్చిబాబు సాన ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ అద్భుతమైన సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి వచ్చిన పాటలకు ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన స్పందన వచ్చింది సినీ హీరో రామ్‌చరణ్ ‘పెద్ది’ సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడిన సంగతి తాజగా వెలుగులోకి వచ్చింది. ఒక . యాక్షన్ సీన్‌ను చిత్రీకరిస్తున్న సమయంలో చరణ్ కంటికి స్వల్ప గాయం అయింది. ఈ సంఘటనపై పెద్ది సినిమా టీం స్పందించింది. వైద్యుల సూచన మేరకు రామ్‌చరణ్ కొద్దీ రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటున్నారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం పూర్తిగా కుదుటగా ఉందని తెలిపింది. అతి త్వరలోనే చర రామ్‌చరణ్ కంటికి గాయం అవటంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. ‘ రామ్‌చరణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’ అని పవన్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *