సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: సీతారాముల కళ్యాణం లోకానికి క్షేమమని, శ్రీరామ నవమి అంటే కేవలం పండుగ మాత్రమే కాదని, సత్యం, ధర్మం, ఓర్పు కలిసిన జీవన మార్గమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. భీమవరంలో పలు చోట్ల ఏర్పాటు చేసిన శ్రీరామనవమి వేడుకల్లో ఎమ్మెల్యే అంజిబాబు పాల్గొని స్వామివారిని దర్శించుకుని సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న దంపతులను ఆశీర్వదించారు. మారుతీ టాకీస్ సెంటర్ లోని శ్రీదాసాంజనేయ స్వామివారిని దర్శించుకున్నారు.. శ్రీమావుళ్ళమ్మ శ్రీరామబాలభక్త మణికంఠ యువజన సంఘం ఆధ్వర్యంలో 14వ వార్డులో సర్వమత సమ్మేళన మందిరం వద్ద సీతారామస్వామి కల్యాణ మహోత్సవాన్ని, లంక పేటలో కోదండ రామాయలంమరియు గునుపూడి లోని రామాలయం ,. రామాయణం తోటలోని కోదండ రామాలయంను, రెస్ట్ హౌస్ రోడ్డులోని కోదండ రామాలయంలోని శ్రీసీతారాముల వారిని, శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకున్నారు. దేవస్థానం వద్ద పానకాన్ని భక్తులకు ఎమ్మెల్యే అంజిబాబు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
