సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో విద్యార్థులను వారి తల్లి తండ్రులను ముప్పు తిప్పలు పెడుతున్న పలు ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా శాఖ, తాజగా కొత్త నిబంధనలు విడుదల చేసింది. ఈ నిబంధనల ప్రకారం కోచింగ్ సెంటర్లు రోజుకు గరిష్ఠంగా 5 గంటలు మాత్రమే తరగతులు నిర్వహించాలి. అదే పనిగా గొప్ప కోసం విద్యార్థులను విశ్రాంతి లేకుండా రుద్దేయకూడదు.పాఠశాలలు, కాలేజీలు సెలవు రోజుల్లో కోచింగ్ తరగతులు నిర్వహించకూడదని పేర్కొంది. విద్యార్థులకు వారానికి ఒక రోజు(ఆదివారం) తప్పనిసరి సెలవు ఇవ్వాలనే నిబంధనను విధించింది.విద్యార్థి మధ్యలో కోర్సు మానేస్తే, మిగిలిన రోజుల ఫీజును కచ్చితంగా తిరిగి చెల్లించాలని తెలిపింది. అలాగే విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను కోచింగ్ సెంటర్లు తమ వద్ద ఉంచుకోకూడదని అదనపు పీజులు పేరుతొ వారిని ఇబ్బంది పెట్టకూడదని స్పష్టం చేసింది. 50 మందికి పైగా విద్యార్థులు ఉన్న సెంటర్లు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘిస్తే మొదటిసారి రూ.50 వేలు జరిమానా, రెండవసారి రూ. లక్ష జరిమానా విధించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *