సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో మార్చి నెల ముగియకముందే సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. నేటి శనివారం నుండి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎండ తీవ్రత పెరగనుందని, ఈ మేరకు ఏకంగా 90 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా ప్రకారం.. 32 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయి. ముఖ్యంగా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, మరియు ఎన్టీఆర్ జిల్లాల్లోని పలు మండలాలపై ఎండల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో 40 నుండి 42°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ప్రజలు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని హెచ్చరించారు. వృద్ధులు, గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *