సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వీరవాసరం గ్రామంలో కొన్ని ప్రాంతాలలో మంచినీటి సమస్య డ్రైనేజీ వీధిలైట్లు పేదలకు ఇళ్ల పట్టాలు తదితర సమస్యలు పరిష్కరించాలని సి.పి.ఎం గ్రామ కమిటీ డిమాండ్ చేసింది నేడు, బుధవారం వీరవాసరం కొత్తపేట బాండ్రేవు పుంత హైస్కూల్ వెనుక ప్రాంత ప్రజలతో పంచాయతీ వద్ద ధర్నా చేసి సర్పంచ్ శ్రీమతి చికెలే మంగతాయారు కి పంచాయతీ కార్యదర్శి కి వినతి పత్రం అందజేశారు ఈ ధర్నాను ఉద్దేశించి పార్టీ జిల్లా కార్యదర్శి జె ఎన్ వి గోపాలన్ మాట్లాడుతూ.. జిల్లాలో జరిగిన పాదయాత్ర సందర్భంగా గత నెల 16వ తేదీన ఆయా ప్రాంత ప్రజలు కొన్ని సమస్యలు మా దృష్టికి తెచ్చారని ముఖ్యంగా మంచినీటి సమస్యపై ఆరోజు పంచాయతీ సెక్రటరీ గారితో మాట్లాడటం జరిగిందని ఇంతవరకు సమస్య పరిష్కారం చేయలేదని తెలిపారు ఇప్పటికైనా గ్రామంలో సమస్యలు పరిష్కరించకపోయినట్లయితే ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి బోర్ర అలమహారాజు నాయకులుపాల్గొన్నారు
