సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో నేడు, గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతూ.. డీఎస్సీ విషయంలో చోటుచేసుకున్న అవకతవకలపై వెంటనే సీబీఐ దర్యాప్తు చేపట్టాలంటూ,మంత్రి లోకేష్ రాజీనామా చేయవల్సిందేనని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలలో డి ఎస్ సి పరీక్షలలో స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగినట్లు ప్రభుత్వమే ఒప్పుకొంది అని తన దృష్టికి వచ్చిందని .. ఆ తప్పు కప్పిపుచ్చేకొందుకే గ్రూప్ 1 పరీక్షల్లో వైసీపీ స్కాం చేసిందని కొత్త ఆరోపణలు సీఎం చంద్రబాబు చేస్తున్నారని నిజానికి తాము పరీక్షలు లేకుండా ఎవరికీ ఉద్యోగాలు వెయ్యలేదని ఎవరి స్వార్ధం కోసం జీవోలు జారీ చెయ్యలేదని , తెలుసుకోవాలన్నారు. ఇక ప్రతిపక్షం లేకుండానే అసెంబ్లీ నడుపుతున్నారని.. ఆఖరికి మండలి కౌన్సిల్ లో కూడా డి ఎస్సీ ఫై చర్చికు ప్రబుత్వం దూరంగా ఉందని జగన్ విమర్శలు గుప్పించారు. ఎవ్వరూ లేకుండా తండ్రీకొడుకులు బ్యాటింగ్ చేస్తున్నారంటూ విమర్శించారు. డీఎస్సీలో తప్పులు జరిగాయి కాబట్టే కౌన్సిల్‌లో చర్చకు ఒప్పుకోలేదని.. పోస్టు కు 14 లక్షలా చప్పున డిమాండ్ చేసినట్లు ఆధారాలు ఉన్నాయని పోలీస్ కేసులు కూడా నమోదు అయ్యాయని, డీఎస్సీ పరీక్షల ప్రశ్నల తయారీ – పరీక్ష నిర్వహణ రెండూ ఒకే అధికారి చేతిలో పెట్టినట్లు లోకేశ్ స్వయంగా అంగీకరించారని.. మేం లేవనెత్తిన అంశం కూడా ఇదే అని జగన్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *