సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాజా మహేంద్రవరంలో గత ఫిబ్రవరి నెలలో జరిగిన పాలకల్తీ లో 17 మంది అమాయకులు ప్రాణాలు పోగొట్టుకోవడం ఎందరో మరణం అంచులవరకు వెళ్లి వచ్చిన ఘటన మరువక ముందే, మరోసారి పాలలో కల్తీ కుంభకోణం నేడు, శనివారం బయటపడింది. ఆహార పరిరక్షణ అధికారులు రాజమహేంద్రవరం తాజగా 190 పాల కేంద్రాల నుండి పాలు నమూనాలను సేకరించి లాబరేటరీలకు పంపించారు. అందులో 9 నమూనాల్లో కల్తీ ఉన్నట్టు నిర్ధారణ అయింది. 9 మంది వ్యాపారుల వద్ద సేకరించిన పాలల్లో డిటర్జెంట్, యూరియా, పిండి పదార్థాలు కలిపినట్టు ల్యాబ్ నివేదికలు తెలిపాయి. వారిని త్రాగినవారు క్రమ క్రమంగా తీవ్ర అనారోగ్యం పాలవుతారు..మొన్నటి ఘటన తెలుగు రాష్ట్రాల ప్రజలు మరవక ముందే పాలకేంద్రాల వారు ఏమాత్రం భయపడకుండా మరోసారి కల్తీ బయటపడటం స్థానికులను తీవ్రంగా ఆందోళనకు గురిచేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *