సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శనివారం భీమవరం నియోజకవర్గ గ్రామాలలో స్థానిక ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు పలు శంకుస్తాపనలు చేసారు. భీమవరం మండలం అనాకోడేరు గ్రామంలో రూ 2 కోట్ల 89 లక్షలతో భీమవరం నుంచి ఎల్ విఎన్ పురం రోడ్డు వయా కొమరాడ – అనాకోడేరు రోడ్డుకు, వెంప గ్రామంలో రూ 2 కోట్ల 80 లక్షలతో మొగల్తూరు నుంచి భీమవరం వయా వెంప రోడ్డు పనులకు ఎమ్మెల్యే అంజిబాబు శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపట్టిందని, సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలకు అధిక ప్రాధాన్యతఇస్తున్నామన్నారు. భీమవరం నియోజకవర్గంలో నాలుగు ప్రధాన రహదారులున్నాయని, భీమవరం – ఎల్ విఎన్ పురం, భీమవరం – లోసరి, భీమవరం – మత్య్సపురి, నరసాపురం, భీమవరం – కాళీపట్నం రహదారులకు శాశ్వత పరిష్కరం చూపి సిమెంట్ రోడ్లు వేయాలన్నారు. త్వరలోనే ఈ రోడ్డు పనులను పూర్తి చేస్తామని, వెంప గ్రామానికి బస్సు సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామా,మండల ప్రజాప్రతినిధులు కూటమి నాయకులు కార్యకర్తలు, పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *