సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం తాడిమళ్ళ వారి కాంప్లెక్స్ లో మార్నింగ్ కాఫీ క్లబ్ ఆధ్వర్యంలో నేడు, శనివారం.. ఇటీవల ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షులుగా నియమితులైన మానేపల్లి సూర్యనారాయణ గుప్తా ను సత్కరించారు. క్లబ్ సభ్యులు మాట్లాడుతూ.. పదవులు బాధ్యతలను మరింత పెంచుతాయని, 15వ సారి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులుగా మానేపల్లి సూర్యనారాయణ గుప్తా నియమితులు కావడం హర్షించదగ్గ విషయమని, ఏ పనినైనా తన భుజాలపై వేసుకుని పరిష్కారం చూపే గొప్ప వ్యక్తి అని అన్నారు, ఈ కార్యక్రమంలో బొండా రాంబాబు,కార్మురి సత్యనారాయణ మూర్తి, ఓలేటి శ్రీనివాస గుప్తా,కొత్త శ్రీనివాస్,మానేపల్లి వెంకన్నబాబు, కోట్ల నాని,భట్టిప్రోలు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు..
