సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒకపక్క ఆకివీడులో పురాతన రామాలయం నేపథ్యంలో నేడు, ఆదివారం చలో ఆకివీడు పేరుతొ పలువురు మత సంఘాల పేరుతొ ర్యాలీలకు సిద్దపడుతుంటే పోలీస్ బలగాలు వారిని సమర్ధవంతంగా అడ్డుకొంటున్నాయి. మరో పక్క శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే రఘురామా కృష్ణంరాజు ఉండి మండలం, చినపుల్లేరు గ్రామంలో జరిగిన “మీ భూమి – మీ హక్కు” కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను స్థానిక రైతులకు అందజేశారు.నేటి ఉదయం ఉండి నియోజకవర్గంలోని వేంపాడు గ్రామంలో జరిగిన మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి వేడుకలలో శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు పాల్గొని ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు.
