సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మరి కొద్దీ రోజులలో కేరళం, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ , అస్సాం లలో నాలుగు రాష్ట్రాలకు జరిగే అసెంబ్లీ ఎన్నికలు నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడి ఎక్కింది. .. ఈసారి ప్రాంతీయంగా తిరుగులేని నేతలుగా చలామణి అవుతున్న నేతలకు అగ్నిపరీక్షగా మారాయి. తమిళనాడు, పశ్చిమ బెంగాల్,కేరళం, అసోం ముఖ్యమంత్రులు ఎంకే స్టాలిన్(డీఎంకే), మమతా బెనర్జీ (టీఎంసీ), పినరయి విజయన్ (సీపీఎం), హిమంతబిశ్వ శర్మ(బీజేపీ) ఆయా రాష్ట్రాల్లో తిరుగులేని అధినేతలుగ అధికారం చలాయిస్తున్నారు. 3 రాష్ట్రాలలో బీజేపీలో ఏ స్థానిక నేతకూ అలాంటి మాస్ ఇమేజి లేకపోయినా ఒక ప్యూహం ప్రకారం కనీసం తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో అధికారం మార్చాలని, కేరళ లో బీజేపీ మెరుపులు మెరిపించాలని బీజేపీ అధినేతలుతో పాటు, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కంకణం కట్టుకొన్నారు. తమిళనాడులో సినీ హీరో విజయ్ పార్టీ మెరుపులే తప్ప అధికారంలోకి రాలేదని సర్వేలు చెబుతున్నాయి ఇక అస్సాం లో హేమంత్ కు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పార్టీ పగ్గాలు పూర్తిగా అప్పజెప్పారు. ఏది ఏమైనా తాజా అసెంబ్లీ ఎన్నికలు చాల చాలా ప్రతిష్ఠాత్మకంగా మారాయి
