సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం 2 టౌన్ శ్రీరామపురంలో సుమారు 400 సంవత్సరాల నాటి పురాతన స్వయంభూ భైరవ స్వామి (కాల భైరవ) వారి ఆలయాన్ని రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే, రఘురామ కృష్ణంరాజు నేడు, సోమవారం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి ఉండి మండలం, వాండ్రం గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా సగం పైగా పూడిపోయి ఉన్న మంచినీటి చెరువును బాగు చేసి, చెరువు చుట్టూ చక్కని వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసారు. ఇది ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మలిచామని పేర్కొంటు చెరువును ప్రారంభించడం జరిగింది. దాదాపు దశాబ్ద కాలంగా ఉన్న ఈ గ్రామ మంచి నీటి కొరత నేటితో తీరనుందని ఈ సందర్భముగా రఘురామా పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *