సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే కార్యాలయంలో నేడు, సోమవారం 56 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి రూ 27,77,339 చెక్కులను ఎమ్మెల్యే అంజిబాబు అందించారు. పేద మధ్య తరగతి వర్గాలకు ఈ సీఎం రిలీఫ్ పండ్ ఒక వరమని ఇప్పటివరకు నియోజకవర్గంలో మొత్తం39వ విడతలలో 693 మంది లబ్ధిదారులకు, రూ 5,39,62,516 లను అందించడం జరిగిందన్నారు. వైద్యం పరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలని, పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నిధులు అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *