సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ‘మన ఊరు – మన జెండా’ కార్యక్రమాన్ని జిల్లా ఇంచార్జ్ కలిదిండి వినోద్ వర్మ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. నేడు సోమవారం భీమవరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు గారపాటి సీతారామాంజనేయ చౌదరి పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా కార్యాలయం నుండి చేపట్టిన భారీ బైక్ ర్యాలీని జెండా ఊపి గారపాటి చౌదరి ప్రారంభించారు. ఈ ర్యాలీ ప్రకాశం చౌక్, అంబేద్కర్ సెంటర్ మీదుగా సాగి బైపాస్ రోడ్డులోని మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజపేయి విగ్రహం వద్దకు చేరుకుంది. అక్కడ ఎంపీ పాక సత్యనారాయణ, జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, వినోద్ వర్మలు వాజ్పేయి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బి.వి. రాజు విగ్రహం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ స్తూపం వద్ద గారపాటి చౌదరి పార్టీ జెండాను ఆవిష్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *