సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇరాన్ ఫై అమెరికా ఏకపక్ష దాడిని అడ్డగిస్తూ ఐక్యరాజ్య సమితిలో రష్యా, చైనా తమ వీటో పవర్ ఉపయోగించిన నేపథ్యంలో మరో ప్రక్క పాకిస్తాన్ ఇరాన్ తో అమెరికాతో చర్చలకు ఎట్టకేలకు అంగీకరించే దిశగా ఒప్పించిన నేపథ్యంలో గత రాత్రి మహా సంగ్రామం ఆగిపోయింది. అందరు ఊహించినట్లే అమెరికా ఇరాన్ తో యుద్దాన్ని మరో 14 రోజులు వాయిదా వేసింది. ఈలోగా హర్ముజ్ జలసంధి ని ఇరాన్ ఓపెన్ చేస్తే అసలు యుద్ధమే ఉందని ఆర్హిక సాయం కూడా చేస్తామని అమెరికా ఆఫర్ ఇచ్చింది. ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం ప్రపంచ శాంతికి ఒక గొప్ప రోజు అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఈ యుద్ధం ఆగిపోవాలని ప్రపంచం మొత్తం కోరుకుంటోంది. ఇరాన్‌కు ఇక చాలు అనిపించింది. పశ్చిమాసియాలో సువర్ణాధ్యాయం మొదలు కాబోతోంది. సానుకూల చర్యలు చేపట్టి వాణిజ్యపరంగా ముందడుగు వేయడానికి ఇరాన్‌కు ఇది సువర్ణావకాశం. ఇరాన్ తమ దేశాన్ని పునర్నిర్మించుకునే పనిని మొదలుపెట్టవచ్చు. అమెరికా తప్పకుండా సహాయం చేస్తుంది. మా దేశం లాగానే ఇరాన్‌కు కూడా మంచి రోజులు రాబోతున్నాయి’ అని ట్రంప్ పేర్కొన్నారు. మొత్తానికి పెద్ద సుడిగుండం నుండి పాకిస్తాన్ ను అడ్డుపెట్టుకొని ‘గౌరవంగా’ బయట పడిన భావంతో ట్రంప్ మాట్లాడారు. పాకిస్తాన్ కు అటు ఇరాన్, ఇటు అమెరికా ట్రంప్ కూడా కృతఙ్ఞతలు తెలపడం కొస మెరుపు.. ఇది భారత్ కు ఒక రకంగా ఇబ్బందికర అంశమే..
