సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: మాజీ సీఎం , వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లి లోని తన పార్టీ కార్యాలయంలో నేడు, బుధవారం నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో చూస్తుండగానే కూటమి ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో సగం కాలం ముగిసిందని, మరో సగం మాత్రమే మిగిలి ఉందని పేర్కొన్నారు. ఈ మిగిలిన కాలంలో, వచ్చే ఏడాది చివరినాటికి తన పాదయాత్ర ప్రారంభం అవుతుందని ఈ పాదయాత్ర తో చంద్రబాబు కు ప్రతిరోజూ “సినిమా చూపిస్తామని” వ్యాఖ్యానించారు. ఇటీవల టీడీపీ కి అనుకూల మీడియా గా ముద్ర పడిన ఛానెల్ ఇటీవల వైసీపీ నేతల భార్యలను కుటుంబ విలువలను కించపరుస్తూ ‘విషపు పలుకులు’ పలికారని, దీనిని ఖండించకుండా వారికీ అధికార పార్టీ నేతలు వత్తాసు పలుకుతుతున్నారని ,తాము అధికారంలోకి రాగానే ఆ మీడియా యాజమాన్యానికి చుక్కలు చూపిస్తామంటూ, తిప్పిన పోలీస్ స్టేషన్కు తిప్పకుండా తిప్పుతానంటూ వార్నింగ్ ఇచ్చారు. అయన కార్యాలయం దగ్గర ఇదేమిటని ప్రశ్నించిన వైసీపీ కార్యకర్తలను జైలులో పెట్టి కొడుతున్నారని.. రేప్పొద్దున ఆ మీడియా అధినేతకు కూడా ఇదే జరుగుతుందంటూ హెచ్చరించారు.. తాను అమరావతి రాజధాని ఖర్చు తగ్గించడానికి నిర్మాణానికి శతాబ్దాల సమయం పడుతుందని ప్లాన్ బి గా మచిలీపట్టణం విజయవాడ గుంటూరు కలిపి అన్ని హంగులతో తక్కువ ఖర్చుతో ‘మావిగన్’ ప్రతిపాదన ప్రకటించానని ఇప్పటికే మచిలీపట్టణం పోర్ట్ తమ హయాంలోనే దాదాపు పూర్తీ చేశామని ప్రకటించారు.
