సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు నేడు, బుధవారం వీరవాసరం మండలం తోలేరు గ్రామంలోని రైతు సేవ కేంద్రం వద్ద బుధవారం గ్రామ సభ ద్వారా పునః సర్వేలో భాగంగా నూతన భూ హక్కు పత్రాల జారీ కార్యక్రమాన్ని నిర్వహించి రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందించి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్టు ద్వారా రీసర్వే పూర్తయిన గ్రామాల్లో నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రైతుల భూ హక్కులకు పూర్తి భద్రత కల్పించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేస్తుందన్నారు. ట్యాంపరింగ్ కు తావు ఉండదని, రికార్డులు సురక్షితమని, తప్పులు లేకుండా కొత్త పాస్ పుస్తకాలు అందిస్తున్నామని అన్నారు. కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాల ద్వారా తమ భూమి భద్రంగా ఉందా.. లేదా? అనే విషయాన్ని రైతులు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చునని, ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. కార్యక్రమంలో గ్రామస్థులు, అధికారులు కూటమి నాయకులు కార్యకర్తలు, పాల్గొన్నారు
