సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఇరాన్ కు సాయంగా ఇజ్రాయిల్ ఫై పోరాడిన లెబనాన్ కు కూడా వర్తిస్తుందని మధ్యవర్తి పాకిస్తాన్ ప్రకటించినప్పటికీ ఇరాన్ యుద్ధ విరమణకు అంగీకరించగానే ఇజ్రాయిల్ ఈ ఒప్పందం లో లెబనాన్ ప్రస్తావన లేదని గత రాత్రి కేవలం 10 నిమిషాలలో వేలది మిసైల్స్ తో విచక్షరహితంగా దాడులు చేసింది. వందలాది మంది ప్రజలు మరణించారు. 1,100 మందికి పైగా గాయపడ్డారని సమాచారం. భారీగా ఆస్తులు ద్వంసం అయ్యాయి. దీనితో ఇరాన్ తమను అమెరికా, ఇజ్రాయిల్ మోసం చేస్తున్నారంటూ ఆగ్రహంతో మరల హోర్ముజ్ జలసంధి మార్గం ను మూసివేసింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ పూర్తిగా ఒప్పందాన్ని అమలు చేసే వరకు అమెరికా సైనిక బలగాలు అక్కడే కొనసాగుతాయని తెలిపారు. హార్మోజ్ జలసంధి ని తెరవవాల్సిందే నని , లెబనాన్ ను విషయం ప్రక్కన పెట్టాలని . ఒకవేళ ఒప్పందాన్ని ఇరాన్ పాటించకపోతే మునుపెన్నడూ చూడని స్థాయిలో విరుచుకుపడతామని హెచ్చరించారు. మధ్యవర్తి గా పాకిస్తాన్ కు ఉన్న కొద్దీ పరువు పోయింది. మరి ఇరాన్ , దానికి మద్దతుగా చైనా రష్యాలు ఎలా ప్రతి చర్యకు దిగుతాయో చూడాలి.
