సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కోస్తా ఆంధ్ర రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక.. విజయవాడ-దువ్వాడ సెక్షన్లోని రాయనపాడు రైల్వేయార్డ్ రీమోడలింగ్ నిర్మాణ పనులు ప్రారంభించిన నేపథ్యంలో ఈ నెల 28వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు ఆ మార్గంలో 20రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది. మరో 10 రైళ్లను దారిమళ్లించడంతో పాటు 2 రైళ్లను రీషెడ్యూల్ చేసినట్లు సీపీఆర్ఓ శ్రీధర్ తెలిపారు. రద్దు అయిన వాటిల్లో సికింద్రాబాద్-విజయవాడ- (శాతవాహన),.గుంటూరు-సికింద్రాబాద్ (గోల్కొండ), విజయవాడ- భద్రాచలం (మెమో), విజయవాడ-డోర్నకల్ (మోమో), విశాఖపట్నం-మహబూబ్నగర్ (విశాఖ), కాకినాడ-లింగంపల్లి(గౌతమి), సంబల్పూర్-నాందేడ్ (నాగావళి), నాందేడ్-విశాఖపట్నం- సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లు ఉన్నాయి.
