సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: 75 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా శ్రీకాకుళం నుంచి తిరుపతికి నేరుగా రెగ్యులర్ రైలు సర్వీస్ ఈ ఏప్రిల్ 13వ తేదీ నుండి ప్రారంభం కానుంది. దీనితో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వాసులకు తాడేపల్లి గూడెం, ఏలూరు మీదుగా . హంసఫర్ ఎక్స్‌ప్రెస్ (17439/17440) ప్రతి ఆదివారం తిరుపతి నుంచి, ప్రతి సోమవారం శ్రీకాకుళం నుంచి అందుబాటులోకి వస్తుంది.. ఏప్రిల్ 13న శ్రీకాకుళం రోడ్ స్టేషన్ నుంచి ఈ రైలును కేంద్ర మంత్రి రామ్ మోహన నాయుడు ప్రారంభించనున్నారు.. గతంలో శ్రీకాకుళం జిల్లావాసులు తిరుపతికి, తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలంటే భువనేశ్వర్ నుంచి వచ్చే రైళ్లపై ఆధారపడేవారు. మొత్తానికి సిక్కోలు వాసుల కల నెరవేరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *