సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎంతో పుణ్యం చేసుకొంటేనే దేవుడి సన్నిధానం లో ఉద్యోగం వస్తుందంటారు. అయితే కొందరు ప్రబుద్ధులు అది అదృష్టంగా భావించక.. ఏకంగా దేవుడి ఆస్తులకు, సొమ్ములు గండి కొట్టి సొంత ఆస్తులు పెంచుకొనే ఘటనలు కోకొల్లు. అయితే దొరికితేనే దొంగలు.. మరి కొందరు దొరలకు పాపం పండాలి మరి ..తాజగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ద్వారకా తిరుమల నకిలీ టికెట్ల స్కాం వ్యవహారంలో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శ్రవణ్ కుమార్ తెలిపారు.. ప్రధాన నిందితుడు రాజుతోపాటు మరో ఆరుగురు దేవస్థానం ఉద్యోగులను అరెస్ట్ చేశామని చెప్పారు.నేడు, గురువారం ఏలూరులో డీఎస్పీ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. నిందితుల వద్ద నుంచి నకిలీ టికెట్ల ప్రింటింగ్‌కు ఉపయోగించిన ల్యాప్‌ట్యాప్, ప్రింటర్, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. గత మార్చి నెల రెండో వారంలో ఈ నకిలీ దర్శనం టికెట్ల విక్రయంబహిర్గతమైంది. ఆలయంలో స్కానింగ్ పాయింట్ వద్ద కొన్ని దర్శనం టికెట్లు స్కాన్ కాకపోవడంతో ఈ వ్యవహారం బట్టబయలు అయింది, విచారణలో దోషులను నిర్ధారించారు.
