సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మండలం యనమదుర్రు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నేడు గురువారం ఆర్డీవో ప్రవీణ్ కుమార్ రెడ్డి, టిడిపి రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, మెంటే పార్ధ సారధి, ఇతర కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే, పులపర్తి అంజిబాబు ప్రారంభించి మాట్లాడారు. రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యాన్ని విక్రయించి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలిగినా వెంటనే సంబంధిత అధికారులకు తెలియ జేయాలని సూచించారు. పాడైపోయిన గోనె సంచులను ఎట్టి పరిస్థితులలోనూ రైతులకు అందించవద్దని, రైతుల నుండి ఎటువంటి ఫిర్యాదులు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ.. రబీ సీజన్ ధాన్యం కొనుగోళ్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,917 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని, కొనుగోలు చేసిన 24 గంటల్లో డబ్బులను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నామని అన్నారు. ఈ . కార్యక్రమంలో అధికారులు, గ్రామస్తులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *