సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:అమెరికా ఇరాన్ ల మధ్య 14 రోజుల యుద్ధ విరామం ఒప్పదం కుదిరి కొద్దీ గంటలు కూడా కాకుండానే లెబనాన్ ఫై దూకుడుగా ఇజ్రాయిల్ దాడి చేసిన నేపథ్యంలో350 మంది పైగా అమాయక ప్రజలు మృతి చెందటం 1500 పైగా గాయాలు పాలు కావడంపై బ్రిటన్ , ఫ్రాన్స్ దేశాలు ఇజ్రాయిల్ ఫై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాయి. దీనికి నీరసన గా మరల హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టు బిగించేసింది. వేలాది నౌకలు ఆగిపోవడంతో 60 కి పైగా ప్రపంచ దేశాలు ఇజ్రాయిల్ ను హద్దులలో ఉండాలని శాంతి చర్చలు జరుగుతున్నపుడు ఇది మంచిపద్దతి కాదని, తాము ఆర్ధికంగా ఎంతో నష్టపోతున్నామని హెచ్చరించాయి. నేటి శుక్రవారం నుండి పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ లో అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య చర్చలు ప్రారంభం కానున్నాయి. రేపు శనివారం చర్చలు కీలక దశకు చేరుకొంటాయి. ఇదిలా ఉండగా సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ కీలక ప్రకటన చేశారు. ప్రపంచంలోని అత్యంత కీలకమైన హోర్ముజ్ నిర్వహణలో ఇది ఇరాన్‌కు ఒక కీలకమైన నూతన అధ్యాయమని ఆయన అభివర్ణించారు. తమ దేశంపై దాడి చేసిన వారిని శిక్షించకుండా వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు.‘జరిగిన నష్టానికి, అమరవీరుల త్యాగాలకు, యుద్ధంలో గాయపడిన వారికి పరిహారం కోసం మేము కచ్చితంగా డిమాండ్ చేస్తాము’ అని అన్నారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని దృష్టిలో పెట్టుకుని ఇరాన్ అనుమతితో హోర్ముజ్‌‌లోప్రతీ రోజు కేవలం 15 నౌకలను మాత్రమేఅనుమతించాలని నిర్ణయించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *