సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేషన్‌లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఆస్తి పన్నుపై రిబేట్ ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెలాఖరులోగా ఆస్తి పన్ను మొత్తం చెల్లించేవారికి ప్రభుత్వం 5% రిబేట్‌ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈనెల 30లోగా 2026-27 సంవత్సరానికి సంబంధించిన ముందస్తు ఆస్తి పన్ను చెల్లించే వారందరికీ 5శాతం తగ్గించి వసూలు చేస్తామని. అధికారులు తెలిపారు. మరోవైపు కార్పొరేషన్‌లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఆస్తి పన్ను బకాయిలపై 50శాతం వడ్డీని మాఫీని ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఈ నెలాఖరు వరకు ఆ గడువును పొడిగించారు. 2025-26 వరకు ఉన్న పెండింగ్‌ ఆస్తి పన్ను బకాయిలు నెలాఖరులోగా చెల్లిస్తే వడ్డీలో 50శాతం రాయితీ ఇస్తారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి ఆస్తి పన్ను చెల్లించాలని అధికారులు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *