సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు భీమవరం మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో భీమవరంలో వున్న అన్ని కోర్టుల ప్రాంగణంలో పెండింగులో వున్న కేసుల పరిష్కారం నిమిత్తం ఈ సంవత్సరపు రెండవ జాతీయ లోక్ అదాలత్ ను వచ్చే ‘మే నెల 9వ తేదీన’ నిర్వహిస్తున్నామని 3వ అదనపు జిల్లా జడ్జి మరియు సంస్ధ చైర్మన్ గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి Dr. B. లక్ష్మీనారాయణ అన్నారు. ఏళ్ళ తరబడి పరిష్కారానికి నోచుకోని అన్ని సివిల్ కేసులు, ప్రోనోటు బాకీ కేసులు, రాజీ కాదగ్గ క్రిమినల్ కేసులు, మోటార్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కేసులు, భార్య భర్తల వివాదాలు, మనోవర్తి కేసులు, గృహ హింస కేసులు, చెక్కు బాకీ కేసులు, ఎక్సైజు కేసులు, బ్యాంకు, BSNL మొండి బకాయి కేసులు తదితర కేసులు రాజీ చేసుకోవచ్చని అన్నారు. కేసు రాజీ చేసుకొనుటకు ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదని, పూర్తిగా ఉచితమని, అన్నారు.
