సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రక్క ఎండలు మండిపోతుండగా మరో ప్రక్క ఒక్కసారిగా గోదావరి జిల్లాలో వర్షాలు కూడా పడుతూ వింత పరిస్థితులు నెలకొన్నాయి.తెలంగాణాలో కూడా ఇటువంటి పరిస్తితులే నెలకొన్నాయి. రాయలసీమ మీదుగా తమిళనాడులోని మన్నార్ వరకు ఒక ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సముద్రం నుంచి వస్తున్న తేమ గాలులు, భూమిపై ఉన్న వేడి కలిపి పిడుగులు పడటానికి కారణమవుతున్నాయి. ద్రోణి ప్రభావంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో . విజయనగరం, పార్వతీపురం మన్యం, జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది. మరోవైపు, గోదావరి జిల్లాల తో పాటు విశాఖ, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను అప్రమత్తం చేసింది. ఆకాశం మేఘావృతమై ఉండటంతో ఉక్కపోత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకే వర్షం వచ్చే సమయంలో రైతులు, పశు కాపరులు పొలాల్లో ఉన్నప్పుడు చెట్ల కింద నిలబడకూడదు. బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు విద్యుత్ స్తంభాలకు, వైర్లకు దూరంగా ఉండాలి.
