సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లోని శ్రీ విష్ణు ఇంజినీరింగ్ కళాశాల ఫర్ ఉమెన్ (SVECW) విద్యార్థినులు దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రతిష్ఠాత్మక జాతీయ స్థాయి ఇంజినీరింగ్ డిజైన్ పోటీ mBAJA SAEINDIA 2026 లో విశేష విజయాలు సాధించారు. జిబా రేసర్స్ బృందం అత్యుత్తమంగా ప్రదర్శన ఇచ్చిన బృందాలలో ఒకటిగా నిలిచింది.ఈ పోటీలో భాగంగా విద్యార్థినులు సింగిల్ సీటర్ ఆఫ్‌రోడ్ ఆల్ టెరైన్ వెహికల్ (ATV) ను రూపకల్పన చేసి అభివృద్ధి చేశారు. వీరిని నేడు, శనివారం కళాశాల ఆవరణలో ఘనంగా సన్మానించారు. ఈ పోటీని SAEINDIA సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని నర్సాపూర్‌లో ఉన్న బి.వి. రాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో ఫిబ్రవరి 25 నుండి మార్చి 1, 2026 వరకు నిర్వహించారు..దేశంలోని 11 రాష్ట్రాల నుండి 45 ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన సుమారు 1500కి పైగా విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *