సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత్ దేశంలో సుప్రసిద్ధ గాయని ఆశా భోంస్లే (92) (Asha Bhosle) నేడు, ఆదివారం మృతి చెందారు. నిన్న (శనివారం) సాయంత్రం ఆమె అస్వస్థతకు లోనయ్యారు. ఛాతిలో ఇన్ఫెక్షన్ సోకడంతో ఆమెను ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేర్పించగా ఈరోజు (ఆదివారం) తుదిశ్వాస విడిచారు. ఆమె సోదరి ప్రసిద్ధ గాయని లత మంగేష్కర్ కావడం గమనార్హం. ఆశా భోంస్లే తెలుగు లో వెంకటేష్ హీరోగా పెళ్లి చేసుకొందాం రా తో పాటు పలు చిత్రాలలో పాటలు పదారు. ఆమె మృతిపై, ప్రధాని, మోడీ ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ నివాళులు అర్పించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సినిమా రంగానికి ఆశా భోంస్లే చేసిన సేవలను కొనియాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *