సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇస్లామాబాద్‌లో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో .. ఎన్ని దేశాలు చెప్పిన ఇజ్రాయిల్ తమ సమీప లెబనాన్ ఫై మిసైల్ దాడులు కొనసాగిస్తున్న నేపథ్యంలో ప్రాన్స్, బ్రిటన్ తో పాటు ముస్లీమ్ దేశాలలో ఆగ్రహం పెల్లుబికుతుంది. మరో ప్రక్క సమర్ధత లేని పాకిస్థాన్ మధ్యవర్తిత్వం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇక ఉద్రికతలు పెరుగుతున్నా నేపథ్యంలో సమయంలో తుర్కియే ( టర్కీ) అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ ‘ఇజ్రాయెల్’కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పశ్చిమాసియాలో మళ్లీ పరిస్థితులు ఉద్రిక్తతకు దారి తీస్తే.. ఇజ్రాయెల్‌పై దాడి చేయటం తమ ప్రస్తుత కర్తవ్యం అని అన్నారు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన రోజు ఇజ్రాయెల్ దాడులు చేయటం దారుణం’ అని అన్నారు. అమెరికా కు మిత్రదేశం గా ఉన్న టర్కీ ఈ విధంగా హెచ్చరించం ఆసక్తికర పరిణామమే..
