సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మభీమవరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో మీడియా తో మాట్లాడుతూ.. తన కృషి నేపథ్యంలో ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో మరికొన్ని రైల్వే సర్వీసులు అందుబాటులోకి వచ్చాయన్నారు. తాడేపల్లిగూడెంలో కూడా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ హాల్ట్ ఇస్తారని మరో 15 రోజుల్లో అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మీదుగా వెళ్లే 9 స్పెషల్ రైళ్లను రెగ్యులర్ సర్వీసులుగా మార్చినట్లు తెలిపారు. 9 రైళ్లకు సంబంధించి.. సికింద్రాబాద్ టు అనకాపల్లి(17043/17044), చర్లపల్లి టు భువనేశ్వర్ న్యూ ఎక్స్‌ప్రెస్ (17067/17068) రెగ్యులర్ రైళ్లుగా ఉంటాయని.. ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు స్టేషన్లలో ఆగుతాయని కేంద్రమంత్రి తెలిపారు. అలాగే చర్లపల్లి టు అనకాపల్లి (17045/ 17046), చర్లపల్లి టు అనకాపల్లి (17053 /17054), కాకినాడ టౌన్ టు హిసార్ ఎక్స్‌ప్రెస్ (17295/17096) రైళ్లు తాడేపల్లిగూడెంలో ఆగుతాయన్నారు. తిరుపతి నుంచి నరసాపురం (17427/17428) ఎక్స్‌ప్రెస్ రైలుకు ఆకివీడు, భీమవరం టౌన్, భీమవరం జంక్షన్, పాలకొల్లు, నరసాపురం స్టేషన్లలో హాల్ట్ ఉందన్నారు. కాకినాడ టౌన్ టు లింగంపల్లి (12775/12776), కాకినాడ టౌన్ టు మైసూర్ ఎక్స్‌ప్రెస్ (17289/17290) రైళ్లు తణుకు, భీమవరం టౌన్, ఆకివీడులో ఆగుతాయన్నారు. చర్లపల్లి – నరసాపురం ఎక్స్‌ప్రెస్ (17061/17062) రైలు ఆకివీడు, భీమవరం టౌన్, వీరవాసరం, పాలకొల్లు, నరసాపురంస్టేషన్లలో హాల్ట్ ఉందని తెలిపారు.
